సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త AI Photo Trend వైరల్ అవుతూనే ఉంటుంది. మొన్నటివరకు మన ఫోటోలను 1980s స్టైల్లోకి మార్చుకోవడం ట్రెండ్‌గా ఉండగా, ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ను ఇంకొంచెం క్రియేటివ్‌గా మార్చి పాతకాలం సినిమా పోస్టర్ లుక్‌లో మన ఫోటోలను క్రియేట్ చేసుకోవడం కూడా చాలామందిని ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా 1980ల నాటి తెలుగు సినిమాల పోస్టర్లు గుర్తు చేసుకుంటే అప్పటి పోస్టర్లకు ఒక ప్రత్యేకమైన లుక్ ఉండేది. పెద్ద హీరో ఫేస్, చేతితో వేసినట్టుగా కనిపించే పెయింటింగ్, గట్టి కలర్ కాంబినేషన్, పాత పేపర్ టెక్స్చర్, సినిమా టైటిల్‌ను పెద్ద అక్షరాల్లో చూపించడం, dramatic lighting వంటి అంశాలు ఉండేవి.
ఇప్పుడు అదే పాతకాలం ఫీల్‌ను AI టెక్నాలజీ సహాయంతో మన ఫోటోకు ఇవ్వొచ్చు. అంతేకాదు, మీరే హీరోగా ఉన్నట్టుగా ఒక fictional 1980s movie poster కూడా తయారు చేసుకోవచ్చు.
ఇందుకోసం పెద్దగా Photoshop knowledge అవసరం లేదు. మీ దగ్గర ఒక మంచి ఫోటో ఉండి, AIకి సరైన prompt ఇవ్వగలిగితే చాలు.
మీ సాధారణ ఫోటోను 1980s సినిమా పోస్టర్‌గా ఎలా మార్చుకోవాలో పూర్తి వివరంగా తెలుసుకుందాం.
1980s AI Cinema Poster అంటే ఏమిటి?
సింపుల్‌గా చెప్పాలంటే, ఒక సాధారణ ఫోటోను AI ఉపయోగించి 1980ల కాలం నాటి సినిమా పోస్టర్లా కనిపించేలా మార్చడమే 1980s AI Cinema Poster Trend.
ఇందులో AI కేవలం photoకి vintage filter వేయడం మాత్రమే కాదు. మనం ఇచ్చిన instructions ఆధారంగా photo composition, background, clothing, lighting, colours, texture వంటి అనేక అంశాలను మార్చే ప్రయత్నం చేస్తుంది.
ఉదాహరణకు ఒక సాధారణ portrait photoను తీసుకుని దానికి:
1980s hairstyle
Retro clothing
Dramatic lighting
Old film-camera effect
35mm film grain
Hand-painted texture
Vintage colour tones
Aged paper effect
Old village or town background
Cinematic composition
వంటివి జోడించవచ్చు.
దీంతో చూస్తే అది ఈ మధ్య తీసిన digital photoలా కాకుండా, చాలా సంవత్సరాల క్రితం print చేసిన సినిమా పోస్టర్లా కనిపించేలా చేయవచ్చు.
ఈ AI Posterను క్రియేట్ చేయడానికి ఏం కావాలి?
దీనికోసం ప్రత్యేకంగా ఖరీదైన software కొనాల్సిన అవసరం లేదు.
ముందుగా మీ దగ్గర ముఖం స్పష్టంగా కనిపించే మంచి quality photo ఉండాలి. Photoలో face ఎక్కువగా blurగా ఉండకపోతే AIకి referenceగా ఉపయోగించడం సులభంగా ఉంటుంది.
ఆ తర్వాత ChatGPT వంటి AI image generation toolను ఉపయోగించవచ్చు.
ఇక్కడ ముఖ్యమైన విషయం Prompt.
AIకి “నా ఫోటోను సినిమా పోస్టర్‌గా మార్చు” అని మాత్రమే చెబితే మనం అనుకున్న output రాకపోవచ్చు. పోస్టర్ ఏ కాలానికి సంబంధించినది, ఎలాంటి clothes కావాలి, background ఎలా ఉండాలి, colours ఎలా ఉండాలి, poster texture ఎలా ఉండాలి వంటి details promptలో చెప్పడం మంచిది

0 Comments